నారప్ప.! ధియేటర్లో వస్తున్నాడప్పా.!
- December 07, 2022
విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా ‘నారప్ప’.. కరోనా టైమ్‌లో తప్పని పరిస్థితుల్లో ఈ సినిమాని ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేశారు. ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకి.
వెంకటేష్ లాంగ్ బ్యాక్ తర్వాత పక్కా విలేజ్ మాస్ బ్యాక్ డ్రాప్‌లో నటించిన సినిమా ఇది. నిజానికి ‘నారప్ప’ ఓటీటీ బొమ్మ కాదు. పక్కా బిగ్ స్ర్కీన్ బొమ్మ.. అని ఓటీటీలో వీక్షించిన ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు.
కానీ, అప్పటి పరిస్థితులు అందుకు కలిసి రాకపోవడంతో, నిర్మాత సురేష్ బాబు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. తమిళ హిట్ ‘అసురన్’కి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్ ఇంటెన్స్ లుక్స్‌కి ప్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఈ సినిమా ధియేటర్ ఫీల్‌ని ఫీలవ్వలేకపోయామే.. అని లోటుగా భావించిన విక్టరీ ఫ్యాన్స్‌కి ఆ లోటు తీరబోతోంది. డిశంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ధియేటర్‌లో రిలీజ్ చేయబోతున్నారు.
ఒక్కరోజు ధియేట్రికల్ రిలీజ్‌గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సందర్భానుసారం రీ రిలీజ్‌ల పర్వం సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న ఈ తరుణంలో వెంకీ ‘నారప్ప’ను ధియేటర్‌లో రిలీజ్ చేయడం ఫ్యాన్స్‌కి పండగలా తోస్తోంది.
ఒక్క రోజు రిలీజ్ కాబట్టి, అవకాశాన్ని, రిలీజ్ అయిన ఏరియాని బట్టి, మూడు నుంచి నాలుగు ఆటలుగా ‘నారప్ప’ను ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







