సౌదీ అరేబియా బడ్జెట్ SR1.13 ట్రిలియన్స్, మిగులు SR16 బిలియన్స్
- December 09, 2022
రియాద్ : 2023 ఆర్థిక సంవత్సరానికి సౌదీ అరేబియా తన సాధారణ బడ్జెట్‌ను ప్రకటించింది. మొత్తం ఆదాయాలు SR1130 బిలియన్లు, ఖర్చులు SR1114 బిలియన్లు, SR16 బిలియన్ల మిగులును ఉన్నట్లు సౌదీ వెల్లడించింది. రియాద్‌లోని అల్-యమామా ప్యాలెస్‌లో జరిగిన మంత్రి మండలి సమావేశంలో రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ వార్షిక బడ్జెట్‌ను ప్రకటించారు. చక్రవర్తి ఆదేశాల ప్రకార.. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. 2023 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర సాధారణ బడ్జెట్‌ను ప్రకటించినందుకు రాజుకు కేబినెట్ , ప్రశంసలను అందించారు. ఆ తర్వాత కేబినెట్ బడ్జెట్లోని అంశాలను సమీక్షించి, ఆమోదించింది. మంత్రులు , అధికారులు తమ అధికార పరిధిలో బడ్జెట్ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలు, ప్రాజెక్టులను అమలు చేయడానికి చురుకుగా పనిచేయాలని క్రౌన్ ప్రిన్స్ ఈ సందర్భంగా ఆదేశించారు.
తాజా వార్తలు
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!







