అఫ్తాబ్ జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు
- December 09, 2022
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్దా వాకర్ మర్డర్ కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని… మరో 14 రోజుల పాటు పొడిగించారు. ఈరోజు అతడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని సాకేత్ కోర్టు ముందు హాజరుపరిచారు. వ్యక్తిగతంగా హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ.. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టుకు తీసుకువెళ్లలేదు.
ఇదిలా ఉండగా.. కేసు దర్యాప్తులో ఓ అధికారి అఫ్తాబ్ చాలా తెలివైనవాడని.. కేసులో కొత్త ట్విస్ట్ ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. అంతకుముందు డిసెంబరు 1న అఫ్తాబ్‌కు నార్కో టెస్టు నిర్వహించగా, అతను తన ప్రియురాలిని హత్య చేసినట్లు అంగీకరించాడు. పరీక్ష సమయంలో, అతను శ్రద్ధా దుస్తులను ఎక్కడ పారవేశాడో కూడా వెల్లడించాడు. తర్వాత ఎఫ్ఎస్ఎల్ నిపుణులు కూడా పోస్ట్-నార్కో పరీక్ష సమయంలో అఫ్తాబ్‌తో సంభాషించారు. ఇక ఈ కేసులో సాక్ష్యాధారాల కోసం ఢిల్లీ పోలీసులు మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లకు బృందాలను పంపారు. ఈ ఏడాది మే 18న శ్రద్దాను హత్య చేసిన కారణంగా అఫ్లాబ్ ప్రస్తుతం తీహార్ జైలులో ఖైదీగా ఉంటున్నాడు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







