యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- June 27, 2026
మనామా: రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఖైదీల మార్పిడి ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేపట్టిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలను బహ్రెయిన్ స్వాగతించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలకు మద్దతు తెలపడంతోపాటు వాటిమధ్య శాంతియుత పరిష్కారాన్ని కనుగొనే అవకాశాలను మెరుగుపరచడం అనేది ఒక నిర్మాణాత్మక హ్యూమటరేయన్ చర్యగా అభివర్ణించింది.
యూఏఈ చేపట్టిన దౌత్యపరమైన మరియు మానవతా ప్రయత్నాలను బహ్రెయిన్ అభినందించింది. ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుండి 25 మధ్యవర్తిత్వ కార్యకలాపాల ద్వారా 7,791 మంది ఖైదీల విడుదలకు యూఏఈ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. చర్చలు మరియు శాంతియుత మార్గాల ద్వారా యుద్ధాన్ని ముగించడానికి, అలాగే ఇందుకోసం జరుగుతున్న అన్ని ప్రాంతీయ మరియు అంతర్జాతీయ కార్యక్రమాలకు తమ మద్దతును బహ్రెయిన్ పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!
- ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మిక నిబంధనలు మరింత సులభతరం..!!
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!







