పంజాబ్‌లో పోలీస్‌స్టేషన్‌పై రాకెట్ గ్రనేడ్‌తో దాడి
- December 10, 2022
అమృత్సర్: పంజాబ్‌లోని తర్న్ తరన్‌లో దుండగులు ఏకంగా పోలీస్ స్టేషన్‌పై రాకెట్ గ్రనేడ్‌తో దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ బయటి పిల్లర్‌కు రాకెట్ గ్రనేడ్ తగిలింది.అయితే పిల్లర్‌కు తగిలిన తర్వాత అది ఎగరడంతో భారీ ప్రమాదం తప్పింది. స్టేషన్ స్వల్పంగానే ధ్వంసమయిందని, ఎవరి ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు మొదలు పెట్టారు. కాగా, తర్న్ తరన్ పోలీస్ స్టేషన్‌ను పంజాబ్ డీజీపీ, ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించనున్నారు.
కాగా, రాకెట్ చాలా శక్తివంతమైనదని అయితే పిల్లర్‌కు ఢీకొట్టిన తర్వత అది మళ్లీ ఎగరడంతో స్టేషన్‌ను ధ్వంసం చేయలేకపోయిందని నిపుణులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







