అయ్యప్ప భక్తులకు TSRTC శుభవార్త
- December 10, 2022
హైదరాబాద్: అయ్యప్ప స్వామి భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమలకు రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీ. అయ్యప్ప స్వామి భక్తులు ప్రవేట్ సంస్థలను ఆశ్రయించి నష్టపోకుండా రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటించారు.
అనుభవజ్ఞులైన డ్రైవర్లతో కూడిన బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది.
ఎలాంటి డిపాజిట్ లేకుండా 10 శాతం రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట వారు, 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు, ఒక అటెండర్ కు ఉచితంగా ప్రయాణం కల్సిస్తామని ప్రకటించారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి కూడా ప్రయాణి ఉచితమన్నారు.
ఈ ప్రత్యేక బస్సులను అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుంచి దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాల వరకు నడుపబడును. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు సీట్ రిజర్వేషన్ కొరకు, శబరిమల యాత్రకు కావాల్సిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్ ల కొరకు http://www.tsrtconline.in సంప్రదించాలని సూచించారు. సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కొరకు కాల్ సెంటర్ 040 23450033, 69440000 నెంబర్లను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







