ఫిఫా ప్రపంచకప్: సెమీఫైనల్‌కు చేరిన తొలి అరబ్ దేశంగా చరిత్ర సృష్టించిన మొరాకో
- December 11, 2022
దోహా: పోర్చుగల్‌ను 1-0తో ఓడించి ఫిఫా ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు చేరిన మొదటి అరబ్ దేశంగా మొరాకో చరిత్ర సృష్టించింది. ఘనా 2010లో చివరి నాలుగు దశలకు చేరుకోవడానికి అవకాశం వచ్చినా పెనాల్టీలో వెనుకబడి ఉరుగ్వే చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ సమయంలో మొరాకో ప్లేయర్ వాలిద్ చెద్దిరాకు రెడ్ కార్డ్ లభించడంతో కేవలం 10 మందితోనే ఆడిన జట్టు అంతిమంగా విజేతంగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌లు ఫ్రాన్స్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగే గేమ్‌లో విజేతగా నిలిచే జట్టుతో సెమీస్ లో తలపడనున్నది.
అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 44వ నిమిషంలో యూసఫ్ ఎన్-బెసిరి ఏకైక గోల్ చేసి మొరాకోను విజేతంగా నిలిపాడు. స్టేడియంలోని మొరాకో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కాగా, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రోన్‌ల్డో కన్నీళ్లతో పిచ్‌ను విడిచిపెట్టాడు. తనకు ఇదే ఆఖరి ప్రపంచ కప్ అని ఇంతకుముందే ప్రకటించారు.
మొరాకో, పోర్చుగల్ గతంలో ఫిఫా ప్రపంచ కప్‌లో రెండుసార్లు మాత్రమే తలపడ్డాయి. జూన్ 1986లో గ్రూప్ దశల్లో మొదటి తలపడ్డారు. అప్పుడు మొరాకో 3-1 తేడాతో గెలిచింది. అయితే 32 ఏళ్ల తర్వాత రొనాల్డో మ్యాచ్-విన్నర్‌గా స్కోర్ చేయడంతో పోర్చుగల్ ప్రతీకారం తీర్చుకుంది. గ్రూప్ స్టేజ్ లో 1-0తో విజయం సాధించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







