ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కలకలం
- December 11, 2022
దుబాయ్: శనివారం దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కనిపించిన ఘటన కలకలం రేపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ B-737 విమానం కాలికట్ నుండి దుబాయ్‌కి షెడ్యూల్ ప్రకారం బయలుదేరింది. దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత, సిబ్బంది విమానంలో పాము ఉన్నట్లు గుర్తించారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ B737-800 ఎయిర్‌క్రాఫ్ట్ VT-AXW ఆపరేటెడ్ ఫ్లైట్ IX-343 (కాలికట్-దుబాయ్). దుబాయ్ చేరుకున్నప్పుడు కార్గో హోల్డ్‌లో ఒక పాము కనిపించిందని సీనియర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారి తెలిపారు. ప్రయాణీకులను సురక్షితంగా విమానం నుంచి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటరీ బాడీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సమగ్ర విచారణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







