ముగిసిన కవిత సీబీఐ విచారణ..
- December 11, 2022
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (CBI) అధికారులు ఇవాళ ఏడున్నర గంటల పాటు విచారించారు. లిక్కర్ స్కాంలో సాక్షిగా ఆమె నుంచి అనేక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. సీబీఐ అధికారులు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని కవిత ఇంటి నుంచి వెళ్లిపోయారు.
సీఆర్పీసీ 161 కింద కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందే సీబీఐ విచారణ గురించి కవిత న్యాయ నిపుణులతో చర్చించారు. నేటి విచారణలో భాగంగా అరోరాతో లింకేంటి?, ఆ రూ.100 కోట్లు ఎక్కడివి? అనే ప్రశ్నలు కవితను సీబీఐ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కాంకు సంబంధించిన వ్యాపారవేత్త అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఉన్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఈడీ రిమాండు రిపోర్టులో ఆమె పేరును పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన రూ.100 కోట్లకు కంట్రోలర్లుగా శరత్ చంద్రతో పాటు కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈడీ చెప్పింది. కాగా, కవితను చూసేందుకు ఆమె ఇంటి వద్దకు టీఆర్ఎస్ శ్రేణులు వస్తున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







