తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
- December 12, 2022
హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 12 వరకు తేలికపాటి జల్లులు పడతాయని చెప్పింది.
ఈనె 13న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని తెలిపింది.
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చలి ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదలి తుపానుగా మారిందని వెల్లడించింది. ఈ గాలులకు తుపాను తోడవ్వడంతో చలి తీవ్రత ఎక్కువ అవుతుందని వివరించింది.
తాజా వార్తలు
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం









