మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- February 13, 2026
హైదరాబాద్: తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ దే హవా కనిపించింది. 116 మున్సిపాలిటీ స్థానాల్లో 66 చోట్ల కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఓవరాల్ గా 1347 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మున్సిపల్ కేంద్రంలో ఉన్న 15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ కేంద్రంలోనూ 16 స్థానాలకు 16 చోట్ల విజయం సాధించింది.
అటు కార్పొరేషన్లలోనూ హస్తం హవా కనిపించింది. ఏడు కార్పొరేషన్లకు గాను 4 కాంగ్రెస్ వశమయ్యాయి. రామగుండం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 15 స్థానాలతో ముందంజలో ఉంది. కార్పొరేషన్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపలేదు. ఇక కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ గెలుపొందింది. నిజామాబాద్ కార్పొరేషన్ లో లీడ్ లో ఉంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో సీపీఐ జోష్ కనిపించింది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది.
116 మున్సిపాలిటీల్లో 67 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. బీఆర్ఎస్ 15 చోట్ల గెలిచింది. 36 చోట్ల హంగ్ ఏర్పడింది. ఒక చోట ఇతరులు గెలిచే అవకాశం ఉంది. కార్పొరేషన్లలో వార్డుల వారీగా చూస్తే.. 176 వార్డుల్లో కాంగ్రెస్, 53 వార్డుల్లో బీఆర్ఎస్, 73 వార్డుల్లో బీజేపీ గెలిచాయి. 76 వార్డుల్లో ఇతరులు గెలుపొందారు. మున్సిపాలిటీల్లో అత్యధికంగా 1376 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొంది. 723 వార్డుల్లో బీఆర్ఎస్, 261 వార్డుల్లో బీజేపీ, 252 వార్డుల్లో ఇతరులు గెలిచారు. గతంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ గెలుపొందిందని సీఎం రేవంత్, టీపీపీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రకటించారు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







