రేపు మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం
- December 13, 2022
చెన్నై: తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి రేపు (బుధవారం) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఉదయనిధి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉదయనిధికి మంత్రి పదవి లభించనుంది. డీఎంకే అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రివర్గ విస్తరణ చేయడం ఇదే తొలిసారి.
45 ఏళ్ల ఉదయనిధి స్టాలిన్..గతంలో తన తాత కరుణానిధికి చెందిన చేపాక్ తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉదయనిధి ప్రస్తుతం పార్టీ యువజన విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆయనకు యువజన సంక్షేమ, క్రీడాశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







