గవర్నర్ తొలగింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
- December 13, 2022
తిరువనంతపురం: కేరళ గవర్నర్‌కు పినరయి ప్రభుత్వానికి మధ్య చెలరేగిన వివాదం మరింత హీటెక్కింది. విశ్వవిద్యాలయాల కులపతి (ఛాన్స్లర్) పదవి నుంచి గవర్నర్‌ను తొలగించాలనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు కదిలింది.ఈ విషయమై ఏకంగా బిల్లు రూపొందించిన ప్రభుత్వం, నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదింపజేసుకుంది. ‘యూనివర్సిటీ చట్టాలు (సవరణ) బిల్లు 2022’ అనే బిల్లు మంగళవారం కేరళ అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం కేరళ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో గవర్నర్‌ను ఛాన్స్‌లర్‌గా కొనసాగించకూడదు. ఆ పదవుల్లో రాష్ట్ర ప్రభుత్వమే వేరే ఎవరినైనా నియమిస్తుంది.
అయితే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. విద్యాధికులను కాకుండా మాజీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ మాజీ హైకోర్టు జడ్జీని కానీ ఛాన్స్లర్ పదవిలో నియమించాలని డిమాండ్ చేసింది. డిసెంబర్ 7న కేరళ న్యాయశాఖ మంత్రి పి.రాజీవ్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సహా మరొక వ్యక్తి నూతన ఛాన్స్లర్ నియామకం చేపట్టాలని ఈ బిల్లులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







