సెల్ఫ్ డ్రైవింగ్ కారుతో ఎంట్రీ ఇవ్వనున్న ‘యాపిల్’..
- December 14, 2022
స్మార్ట్ ఫోన్లల్లో టాప్ బ్రాండ్ ఏదీ అంటే అందరూ చెప్పేది ‘యాపిల్’ గురించే. యాపిల్ నుంచి వచ్చిన ఐఫోన్లు, ఐపాడ్స్, మ్యాక్ బుక్స్ వంటివి ఎంతగా ఆదరణ పొందుతున్నాయో తెలిసిందే. ఖరీదు ఎక్కువైనా వీటిని కొనేందుకు వినియోగదారులు వెనక్కి రావడం లేదు.
అంతగా వినియోగదారుల్లో గుర్తింపు తెచ్చుకున్న యాపిల్ త్వరలో కార్ల మార్కెట్లోకి ప్రవేశించబోతుంది. 2026లో యాపిల్ తొలి కారు మార్కెట్లోకి వస్తుంది. అది కూడా సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కారు. టైటాన్ ప్రాజెక్టు కింద ఈ కారును యాపిల్ సంస్థ 2014 నుంచి అభివృద్ధి చేస్తోంది. మొదట్లో ఈ కారును పూర్తి అటానమస్ డ్రైవింగ్ మోడ్‌లోనే రిలీజ్ చేయాలనుకుంది. అది కూడా స్టీరింగ్ వంటివి ఏవీ లేకుండానే విడుదల చేయాలనుకుంది. కానీ, తర్వాత తన ప్రణాళికలు మార్చుకుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కారును రూపొందిస్తున్నప్పటికీ, అది పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ కాదు. హైవేల మీద మాత్రమే స్వతంత్రంగా డ్రైవ్ చేయగలదు. మిగతా చోట్ల డ్రైవర్లే నడపాల్సి ఉంటుంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే టెస్లాకు గట్టి పోటీ ఇస్తుందని యాపిల్ కంపెనీ భావిస్తోంది. అలాగే ఎలక్ట్రిక్ కార్లు తీసుకొచ్చిన మెర్సిడెస్, జీఎం వంటి సంస్థలకు కూడా పోటీగా నిలవనుంది.
ముందుగానే ఈ కారును మార్కెట్లోకి తేవాలనుకున్నప్పటికీ సాధ్యపడటం లేదు. అందుకే 2026లోనే కారు మార్కెట్లోకి వస్తుంది. ఇక కారు ధర విషయానికొస్తే ఈ సెగ్మెంట్‌లోని ఇతర కార్లకంటే తక్కువ ధరకే అందుబాటులోకి తేవాలనుకుంటోంది. దాదాపు లక్ష డాలర్లకు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.81 లక్షలకు ఈ కారు మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







