రష్యాలో పెరుగుతున్న ఫ్లూ
- December 15, 2022
మాస్కో: రష్యాలో ఫ్లూ వైరస్ విజృంభిస్తుండటంతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వీయ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తనకు ఫ్లూ సోకకుండా బంకర్లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో రష్యాలో ఫ్లూ సోకిన వారి సంఖ్య పెరిగిపోతోంది. పుతిన్ పక్కనే ఉండే పలువురు ఉన్నతాధికారులు, పాలక వర్గంలోని వాళ్లకు కూడా ఫ్లూ సోకింది.
దీంతో పుతిన్ ముందు జాగ్రత్తగా బంకర్లోకి వెళ్లిపోయాడని ఆయన సన్నిహితుడు, పుతిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ తెలిపారు. కొద్ది రోజులుగా పుతిన్ బంకర్లోనే ఉంటున్నాడు. ఇప్పటికే పుతిన తన అధికారిక కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నాడు. ఈ నెలలో జరగాల్సిన కీలక ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పుతిన్ తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.
దీనిలో భాగంగా పుతిన్ బంకర్లోకి వెళ్లాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకల్ని కూడా పుతిన్ బంకర్లోనే జరపుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







