కైవ్‌పై దాడికి రష్యా 2 లక్షల మంది సైనికులను సిద్ధం చేస్తుంది: ఉక్రెయిన్
- December 16, 2022
మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇటీవల అన్నారు. మరోవైపు తమ దేశం శ్మశానంగా మారిపోతున్నా ఉక్రెయిన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది. మరోపక్క, ఉక్రెయిన్ కమాండ్ ఇన్ చీఫ్ జనరల్ వలేరీ జాలుజ్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 తొలి నెలల్లో రష్యా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీని కోసం కొత్తగా 2 లక్షల మంది సైనికులను సిద్ధం చేసుకుంటోందని చెప్పారు. ఒక బ్రిటిష్ వీక్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో రష్యా దాడులు జరుగుతాయని ఆయన అన్నారు. జనవరి చివర్లో దాడులు మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పుడు రష్యా దాడులను తగ్గించడం కూడా యుద్ధ వ్యూహంలో భాగమేనని చెప్పారు. ఈ గ్యాప్ లో తన సైనిక బలగాలను పెంచుకోవడం ద్వారా మళ్లీ యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని అన్నారు. యుద్ధానికి సంబంధించి ఇది చాలా వ్యూహాత్మక నిర్ణయమని చెప్పారు. తమ రాజధాని కీవ్ ను రష్యా అటాక్ చేస్తుందనే విషయంలో తనకు ఎలాంటి అనుమానం లేదని అన్నారు.
తాము కూడా రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని అన్ని లెక్కలు వేసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఎన్ని ట్యాంకులు, ఆయుధాలు, సైనికులు కావాలనే విషయంలో తాము కూడా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇప్పుడు తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యం ఫ్రంట్ లైన్ ను కాపాడుకోవడమేనని చెప్పారు. ఇకపై తమ భూభాగాన్ని కొంత కూడా వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని తెలిపారు. తమ శత్రువును తాము జయిస్తామనే నమ్మకం తనకు ఉందని… అయితే తమకు యుద్ధ వనరులు కావాల్సి ఉందని చెప్పారు. 300 యుద్ధ ట్యాంకులు, 600 నుంచి 700 వరకు ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికిల్స్, 500 హోవిట్జర్ లు తమకు అవసరమని తెలిపారు.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్‌ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









