శ్రీలీలా నువ్వెందుకు ఆ తప్పు చేశావ్.!

- December 17, 2022 , by Maagulf
శ్రీలీలా నువ్వెందుకు ఆ తప్పు చేశావ్.!

మాస్ రాజా రవితేజ సరసన ఈ మధ్య యంగ్ హీరోయిన్లు తెగ జత కట్టేస్తున్నారు. యంగ్ హీరోయిన్లతో మాస్ రాజా ఆన్ స్ర్కీన్ చేస్తున్న రొమాన్స్‌కి పాపం ఆయన ఫ్యాన్సే జుగుప్స ఫీలవుతున్నారు. 
‘ఖిలాడీ’ సినిమాలో రవితేజ యంగ్ హీరోయిన్స్‌తో ఏమాత్రం తగ్గకుండా మూతి ముద్దులు సైతం కానిచ్చేశారు. అలాగే ఓవర్ డోస్ రొమాంటిక్ సీన్లలో ఎలాంటి బెరుకూ లేకుండా నటించేశారు. కాస్త వయసు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా.. అంటూ నెట్టింటి వేదికగా రవితేజపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయ్.
ఇప్పుడు ‘ధమాకా’ కోసం కూడా యంగ్ హీరోయిన్‌నే ఎంగేజ్ చేశాడు రవితేజ. ‘పెళ్లి సందడి’తో క్రేజ్ దక్కించుకున్న శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. అయితే, తనపై వచ్చిన ట్రోల్స్‌ని బట్టి, రవితేజ, శ్రీలీల విషయంలో కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకున్నాడనీ తెలుస్తోంది.
కానీ, శ్రీలీలపై నెటిజన్లు జాలి చూపిస్తున్నారు. ఎంత అవకాశాలు రాకపోతే మాత్రం మరీ మాస్ రాజాతో రొమాన్స్‌కి ఎలా ఒప్పుకున్నావ్.! అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అయితే, ఇలాంటివన్నీ ఆ సక్సెస్‌లో కొట్టుకెళ్లిపోతాయనుకోండి. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com