దిల్ రాజు కెలుకుడు.! తగ్గేదేలే.!
- December 17, 2022
పబ్లిసిటీ కోసం దిల్ రాజు ఎంత దూరమైనా వెళతారనడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులే బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఆయన సినిమా ‘వారసుడు’ కోసం తెలుగు రాష్ర్టాల్లో కీలకమైన ధియేటర్లు లాక్ చేసి, తెలుగు సినీ నిర్మాతల మండలి గుస్సాకి కారణమయ్యారు దిల్ రాజు.
ఇక్కడి పరిస్థితి ఇలా వుంటే, తమిళ నాట కూడా కెలుకుడు మొదలెట్టేశారు రాజుగారు. అక్కడ కూడా ధియేటర్ల విషయంలో చిచ్చు పెట్టారు. అదే రోజు రిలీజ్ అవుతున్న అజిత్ సినిమా కన్నా, తాను రూపొందిస్తున్న విజయ్ సినిమాకే అజిత్ కన్నా 50 ధియేటర్లు ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దాంతో, తమ హీరోని తక్కువ చేస్తారా.? అంటూ అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దిల్ రాజుపై ఫైర్ అవుతున్నారు. తాజాగా తన మాటల్ని వక్రీకరించారనీ, తాను అలా అనలేదనీ మీడియాని కెలికారు. ఇలా ఒకదావి మీద ఒకటి అన్నట్లుగా రాజుగారి కెలుకుడు ఆగేదే లే.! అన్నట్లుగా ఇన్‌ష్టాల్‌మెంట్లలో నడుస్తోంది.
సినిమా రిలీజ్ అయ్యే వరకూ రాజుగారి ఈ కెలుకుడు తగ్తేదే లే.! ఏమో చూడాలిక.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







