నిఖిల్ వెర్సస్ రవితేజ.! ఎవరి దమ్మెంత.?
- December 17, 2022
ఈ డిశంబర్ 23న రెండు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా వున్నాయ్. అవే నిఖిల్ సిద్దార్ద్ నటించిన ‘18 పేజీలు’ ఒకటి. మాస్ రాజా రవితేజ నటించిన ‘ధమాకా’ ఇంకోటి.
రెండూ చెప్పుకోదగ్గ సినిమాలే. ‘కార్తికేయ 2’తో నిఖిల్ ప్యాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. సో, కార్తికేయ 2 తర్వాతి సినిమా అంటే అంచనాలు బాగా వున్నాయ్.
అంతేకాదు, ఈ సినిమాకి కథ అందించింది లెక్కల మాస్టారు సుకుమార్. ఆయన బ్యానర్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి జీ 2 సంస్థ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్ సక్సెస్ పెయిర్ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఎటు చూసినా నిఖిల్ సినిమాకి మెయిన్ అస్సెట్స్ చాలా వున్నాయ్.
ఇక ‘థమాకా’ విషయానికి వస్తే, మాస్ రాజా కెరీర్ ఈ మధ్య ఏమంత బాగాలేదు. దాంతో, ‘ధమాకా’ ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నారు. కానీ, రిలీజ్ తర్వాత ఆడియన్స్ ఎలాంటి తీర్పు ఇస్తారనేది తెలియాలంటే 23 వరకూ వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







