BD2 మిలియన్ల మనీలాండరింగ్.. వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలుశిక్ష

- December 18, 2022 , by Maagulf
BD2 మిలియన్ల మనీలాండరింగ్.. వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలుశిక్ష

బహ్రెయిన్: BD2 మిలియన్ లాండరింగ్, పెట్టుబడిదారుగా నటించి GCC వ్యాపారవేత్తను BD3 మిలియన్ల మోసం చేసిన ఆరోపణలపై 40 ఏళ్ల వ్యక్తికి హై క్రిమినల్ కోర్ట్ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు అతనికి BD100,000 జరిమానా విధించింది. అలాగే అతని నుండి BD2,517,709 డబ్బు లేదా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. నిందితుడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టుబడి పేరుతో బాధితులను మోసం చేశాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. బహ్రెయిన్, ఇతర గల్ఫ్ దేశాలలో పెట్టుబడి పెడతానంటూ మొత్తం BD3 మిలియన్లను నిందితుడు బదిలీ చేశాడు. బాధితులకు 12% నుండి 15% వడ్డీ ఇస్తానని నిందితుడు హామీ ఇచ్చాడు. తొలుత కొంత మందికి లాభాలు అందజేసిన నిందితుడు ఆతర్వాత మొఖం చాటేశాడు. అనంతరం బాధితుల ఫిర్యాదుతో నిందితుడిపై మనీలాండరింగ్ కేసులను నమోదు చేశారు.  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ అతని పేరుతో ఉన్న సంస్థల రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసింది. అతను నిధులను సేకరించడం చట్టవిరుద్ధమని అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు.

జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ప్రకారం.. నిందితుడు గతంలో ఒక అంతర్జాతీయ బ్యాంకులో పనిచేశాడు. అనేక సంస్థలను అతను స్థాపించాడు. పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ చాలా సంవత్సరాల క్రితమే వీటిని రద్దు చేసింది. అనంతరం నిందితుడు అనేక మారు పేర్లతో అధిక లాభాల పేరుతో పలువురిని మోసం చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. నిందితుడు ఇతర కేసుల్లో జైలు శిక్ష అనుభవించి అక్రమంగా యూరప్‌కు పారిపోయిన వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com