2023 చివరి నాటికి పూర్తిస్థాయిలో A380 విమానాలు: ఎమిరేట్స్
- December 18, 2022
దుబాయ్: ఎయిర్‌బస్ A380లను వినియోగిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆపరేటర్ అయిన ఎమిరేట్స్.. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో తన సూపర్‌జంబోలను తిరిగి సర్వీస్ లోకి తీసుకురావాలని యోచిస్తోంది. దుబాయ్‌కి చెందిన ఎయిర్‌లైన్స్ సామర్థ్యం దాని ప్రీ-పాండమిక్ స్థాయిలలో 80 శాతానికి పుంజుకుందని, దాని విస్తారమైన నెట్‌వర్క్ సంక్షోభానికి ముందు పరిమాణంలో 95 శాతానికి తిరిగి వచ్చిందని ఎమిరేట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అద్నాన్ కాజిమ్ చెప్పారు. దుబాయ్‌లోని స్కిఫ్ట్ గ్లోబల్ ఫోరమ్ ఈస్ట్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎమిరేట్స్ ప్రస్తుతం నాలుగు-ఇంజిన్ విమానాలలో దాదాపు 85 విమానాలను నడుపుతోందన్నారు. కోవిడ్-19 సంక్షోభం గరిష్ట సమయంలో విమాన ప్రయాణాన్ని దాదాపుగా నిలిపివేసిన సమయంలో దాని 116 A380 విమానాలను గ్రౌండింగ్ చేశారని, వాటిని క్రమంగా తిరిగి సర్వీసులకు మళ్లిస్తున్నట్లు వివరించారు. A380లలో కొన్ని మెయింటెనెన్స్‌లో ఉండగా.. మరికొన్ని రీట్రోఫిట్ చేయడానికి కేటాయించబడ్డాయన్నారు. ఎమిరేట్స్ తన క్యాబిన్ ఇంటీరియర్‌లను A380లు, 777ల కోసం రీట్రోఫిట్ చేయడానికి $2 బిలియన్ల రెండేళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
వచ్చే ఏడాది మధ్య నాటికి అదనంగా 400 మంది పైలట్లు, 5,000 నుండి 6,000 మంది క్యాబిన్ సిబ్బందిని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అద్నాన్ కాజిమ్ తెలిపారు. దీంతో తమ వర్క ఫోర్స్ 4,500 మంది పైలట్లు, 17,500 మంది క్యాబిన్ సిబ్బందికి పెరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్‌వర్క్ బస్ట్..!!







