ఆర్థిక మోసం కేసులో 23 మంది ముఠాకు 111 ఏళ్ల జైలు శిక్ష
- December 20, 2022
రియాద్: ఆర్థిక మోసానికి పాల్పడినట్లు తేలిన తర్వాత సౌదీ కోర్టు 23 మంది వ్యక్తుల ముఠాకు 111 సంవత్సరాల జైలు శిక్ష, SR 28.6 మిలియన్ జరిమానా విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. ఇందులో మోసానికి పాల్పడ్డ వాణిజ్య సంస్థలు కూడా ఉన్నాయి. నేరానికి పాల్పడిన డబ్బుతో పాటు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా జప్తు చేయాలని, జైలు శిక్ష, జరిమానాలు చెల్లించిన తర్వాత ప్రవాసిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నేరస్థులు వర్చువల్ కరెన్సీలు, బంగారం, చమురు, ప్రీపెయిడ్ కార్డ్‌లు, విదేశీ అక్రమ పెట్టుబడులపై పెట్టుబడి పేరుతో ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. నకిలీ వ్యక్తులు, వాణిజ్య సంస్థల పేర్లతో విదేశాలకు డబ్బులను బదిలీ చేస్తారు. కొందరికి భారీగా లాభాలు ఇచ్చినట్లు తమ వెబ్ సైట్లలో ఫేక్ డాటాను పెట్టి.. ఇతరులకు వాటిని చూపుతూ మోసాలకు పాల్పడేవారు. కొందరికి మొదట్లో లాభాలు ఇవ్వడంతో ఇతురులు కూడా వారి మోసాల్లోవలలో పడి భారీగా పెట్టుబడులు పెట్టి మోసపోయారు. నేరస్థులపై ఆర్థిక మోసం, మనీలాండరింగ్ తదితర చట్టాలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై అరెస్టు చేసి, సమర్థ న్యాయస్థానానికి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







