క్యాష్ లెస్ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించిన 140 సంస్థలు
- December 20, 2022
మస్కట్: వినియోగదారులకు నగదు రహిత చెల్లింపు సేవలను అందించే నిబంధనలను దాదాపు 140 సంస్థలు ఉల్లంఘించిన్నట్లు వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MoCIIP) తెలిపింది. రెస్టారెంట్లు, కేఫ్‌లతో పాటు పారిశ్రామిక ప్రాంతాలు, కాంప్లెక్స్‌లు, వాణిజ్య కేంద్రాలు, గిఫ్ట్ మార్కెట్లు, ఆహారపదార్థాలు, బంగారం, వెండి వస్తువులు, పండ్లు, కూరగాయలు, ఎలక్ట్రానిక్స్, బిల్డింగ్ మెటీరియల్స్, పొగాకు విక్రయాలు వంటి ఎనిమిది వాణిజ్య కార్యకలాపాలలో క్యాష్ లెస్ సదుపాయం అందుబాటులో ఉన్నదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల సమన్వయంతో అన్ని సంస్థలు, కంపెనీలు తమ స్టోర్లు, అవుట్లెట్లలో ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలను అందించడానికి కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫీజులు లావాదేవీ మొత్తంలో 15 శాతం లేదా డెబిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపు కోసం గరిష్టంగా RO10 లేదా QR కోడ్ ద్వారా మొబైల్ చెల్లింపుల కోసం 0.75% మించకూడదని పేర్కొంది. ఒమన్ విజన్ 2040 ప్రకారం.. సుల్తానేట్‌లో డిజిటల్ పరివర్తనను సాధించడానికి, చట్ట ఉల్లంఘనలను నివారించడానికి దుకాణాలు, అవుట్లెట్లలో ఎలక్ట్రానిక్ చెల్లింపు ఎంపికలను అందించడానికి అందరూ కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ అన్ని వ్యాపార సముదాయాలు, కంపెనీలను కోరింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







