విమానాశ్రయాల్లో ఫోన్లు, ఛార్జర్ల చెకింగ్ బాధ ఉండదిక!
- December 22, 2022
న్యూ ఢిల్లీ: విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది.విమానాశ్రయాల్లో తనిఖీల కోసం బ్యాగుల నుంచి ఫోన్లు, ఛార్జర్లు, ల్యాప్‌టాప్ వంటివి బయటకు తీసి చూపించే బాధ ప్రయాణికులకు ఇక తప్పేలా ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులను బ్యాగుల్లో నుంచే తనిఖీ చేసేలా అత్యాధునిక స్కానర్లను విమానాశ్రయాల్లో ఏర్పాటు చేయాలని విమానయాన భద్రతా పర్యవేక్షణ సంస్థ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ప్రతిపాదనలు చేసింది.
ప్రస్తుతం విమానాశ్రయాల్లో ఉపయోగించే స్కానర్లు.. హ్యాండ్ బ్యాగేజీల్లో ఉన్న వస్తువులను టు-డైమెన్షనల్(2D)లో చూపిస్తాయి. అయితే వీటిని 3డీలో చూపించేలా కంప్యూటర్ టోమోగ్రఫీ టెక్నాలజీ ఆధారిత స్కానర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు బీసీఏఎస్ జాయింట్ డైరెక్టర్ జనరల్ జైదీప్ ప్రసాద్ తెలిపారు. “ఈ స్కానర్లతో ప్రయాణికులు ఇక పై తమ హ్యాండ్ బ్యాగేజీల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలను బయటకు తీసి ప్రత్యేక ట్రేలలో తనిఖీలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు” అని వెల్లడించారు.దీనివల్ల, విమానాశ్రయాల్లో తనిఖీల సమయం కూడా ఆదా అయి రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.
తాజా వార్తలు
- ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







