రిలయన్స్ చేతికి మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా
- December 22, 2022
ముంబై: మెట్రో క్యాష్ & క్యారీ ఇండియా బిజినెస్‌ను రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకుంది.ఈ మేరకు మెట్రో క్యాష్ & క్యారీ ఇండియాలో వందశాతం వాటాల టేకోవర్ కోసం కుదిరిన ఒప్పందంపై రిలయన్స్ రిటైల్ సంతకం చేసింది. రూ.2,850 కోట్లకు మెట్రో క్యాష్ అండ్ క్యారీని రిలయన్స్ సొంతం చేసుకుంది.దీంతో మెట్రో ఇండియా నెట్‌వర్క్ మొత్తం రిలయన్స్ పరం అవుతాయి. మెట్రోకు దేశంలోని ప్రధాన నగరాల పరిధిలో రిజిస్టర్డ్ కిరాణా స్టోర్స్ ఉన్నాయి. రెగ్యులేటరీ, ఇతర సంస్థలు, కేంద్ర ప్రభుత్వశాఖల ఆమోదం లభించిన తర్వాత వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి డీల్ పూర్తవుతుందని భావిస్తున్నారు.
2003లో క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ ఫార్మాట్‌లో మెట్రో ఇండియా సేవలు ప్రారంభించింది. దేశంలోని 21 నగరాల పరిధిలో 31 అతిపెద్ద స్టోర్స్ నిర్వహిస్తున్నది.ఇందులో సుమారు 3,500 మంది సిబ్బంది పని చేస్తున్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి మెట్రో ఇండియా సేల్స్ రూ.7,700 కోట్లకు చేరుకున్నాయని రిలయన్స్ రిటైల్ తెలిపింది.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్‌లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







