BF 7వేరియంట్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
- December 22, 2022
హైదరాబాద్: మరోసారి కోవిడ్ కొత్తగా తయారైన BF7 కోవిడ్ వేరియంట్ అంత కంటే ఎక్కువ హడలెత్తిస్తోంది. ఈ కొత్త వేరియంట్ ప్రభావరం ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. భారత్ లో కూడా ఈ BF7 కోవిడ్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. BF7 కోవిడ్ వేరియంట్ పై తెలంగాణ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.
సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉంది.దీంట్లో భాగంగా ఆరోగ్యశాఖ ఇప్పటికే అన్ని జిల్లాల్లోను ఆస్పత్రులను అలర్ట్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు.ఎయిర్ పోర్టులో ప్రయాణికుల స్క్రీనింగ్ తో పాటు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని నిర్ణయించింది. దీనికి అవసరమైన చర్యలు తీసుకోనుంది తగిన .జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన అవరసరం లేదని ఆరోగ్యశాఖ సూచించింది.అలాగే మాస్కులు తప్పని సరి కానున్నాయి.
కాబట్టి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం చాలా ఉంది.ఏది ఏమైనా ముందు జాగ్రత్తలు అనేవి పెను ప్రమాదం నుంచి బయటపడేస్తాయనే విషయం అందరు గుర్తించాలి.తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







