15 మిలియన్ దిర్హామ్‌లు గెలుచుకున్న భారతీయ డ్రైవర్
- December 23, 2022
దుబాయ్: దుబాయ్‌లోని భారతీయ డ్రైవర్ అజయ్ ఒగులా(31) ఎమిరేట్స్ నిర్వహించిన మెగా డ్రాలో 15 మిలియన్ దిర్హామ్‌ల మెగా బహుమతిని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఒగులా మాట్లాడుతూ.. జాక్‌పాట్ కొట్టడాన్ని నమ్మలేకపోతున్నట్లు తెలిపాడు. మొదట Dh15,000 గెలిచానని అనుకున్నానని, కానీ ఇంత పెద్దమొత్తంలో గెలుస్తానని కలలో కూడా అనుకోలేదన్నాడు. వచ్చిన భారీ మొత్తంతో తన కుటుంబానికి ఇల్లు కట్టి, సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఓగులా చెప్పాడు. అలాగే తన ఛారిటీ ట్రస్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తానని, దీంతో తన స్వగ్రామం, పొరుగు గ్రామాలలో చాలా మందికి ప్రాథమిక అవసరాలు పొందడానికి సహాయపడుతుందని తెలియజేశారు. తెలంగాణలోని, జగిత్యాల జిల్లా, తుగూరుకు చెందిన అజయ్ ఒగులా నాలుగు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం యూఏఈకి వచ్చాడు. ప్రస్తుతం దుబాయ్ లోని ఆభరణాల సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తూ ప్రతి నెలా 3,200 దిర్హామ్‌లు సంపాదిస్తున్నాడు. అదే డ్రాలో 50 ఏళ్ల బ్రిటీష్ జాతీయురాలు పౌలా లీచ్ 77,777 దిర్హామ్‌లు గెలుచుకున్నారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన పౌలా లీచ్ గత 14 సంవత్సరాలుగా యూఏఈలో మానవ వనరుల నిపుణులుగా పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్







