గంజాయి గుట్టు తెలిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలపండి: ఏపీ డీజీపీ

- December 23, 2022 , by Maagulf
గంజాయి గుట్టు తెలిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలపండి: ఏపీ డీజీపీ

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాలతో ఏపీ వ్యాప్తంగా గంజాయి డెన్‌ల పై మెరుపు దాడులు చేస్తున్నారు.అక్రమార్కుల బెండు తీస్తున్నారు ఖాకీలు.. తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతున్నారు. విశాఖ- తూర్పు గోదావరి ఏజెన్సీలో గంజాయి అక్రమ సాగు, అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి దందా పై ఈ ఏడాది పోలీసులు నిఘా పెంచారు. ఆధునిక టెక్నాలజీ.. శాటిలైట్‌ ఫోటోల సాయంతో గంజాయి సాగును గుర్తించారు. వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఓవైపు గంజాయి డెన్‌లపై మెరుపు దాడులు..మరోవైపు అరెస్టులపర్వంతో కూకటివేళ్లను పెకలించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 45 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో 70 శాతం ఒడిషా నుంచి డంప్‌ అవుతున్నదే. జిల్లాల వారీగా స్వాధీనం చేసుకున్న గంజాయి ఇది. ఇప్పుడిక ఖాకీల ఆపరేషన్‌లో భాగంగా రెడీ టు ఫయిర్‌ ఘట్టం మొదలైందిప్పుడు.

ఖతమ్‌ కరో గంజాయి ఫేస్‌ -2లో భాగంగా 23 డిసెంబర్‌ ..ఫ్రై డేతో ఇకపై ఏపీలో గంజాయికి డ్రై డేస్‌ మొదలయ్యాయి.. జిల్లాల వారీగా గంజాయికి నిప్పుపెట్టారు పోలీసులు. ఏలూరు రేంజ్‌లో 465 కేసుల్లో స్వాధీనం చేసుకున్న దాదాపు 65 వేల గంజాయిని స్మాష్‌ చేసేశారు.  ఇక జిల్లాల వారీగా టోటల్‌గా 2 లక్షల 45 వేల కేజీల గంజాయి దహన కార్యక్రమం కొనసాగుతోంది. ఓవైపు ఇలా ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు పోలీసులు. గంజాయి మాఫియా బెండు తీయడం సహా పాత నేరస్తులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడం.. మన్యం రైతులను అల్లం, పసుపు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడంలో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.

గంజాయి వాడినా..సరఫరా చేసినా నేరం. ఆ ట్రాప్‌లో పడొద్దని స్కూళ్లు, కాలేజీల దగ్గర విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పోలీసులు. .గంజాయి పైన చైతన్యం కోసం హోర్డింగ్ లపైన అన్ని కాలేజీలు స్కూల్స్ వద్ద SEB టోల్ ఫ్రీ నెంబర్లు 14500, 14400ఏర్పాటు చేసారు. యువత భవితను నిర్వీర్యం చేసే గంజాయిని నిర్మూలన కేవలం పోలీసుల విధి మాత్రమే కాదు. ప్రతీ ఒక్కరి బాధ్యత. డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి పర్యవేక్షణలో సక్సెస్‌ బాటలో సాగుతోన్న ఆ ఆపరేషన్‌ మరింత విజయవం వంతం కావాలంటే అందరి సహకారం అవసరం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com