మక్కాను ముంచెత్తిన వరదలు.. నష్టం అంచనాకు కమిటీలు
- December 24, 2022
            జెడ్డా: మక్కాలో వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కమిటీలను ఏర్పాటు చేసినట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ తెలిపింది. కుండపోత వర్షాలు పవిత్ర నగరాన్ని అతలాకుతలం చేసిందని, వరదల వల్ల నష్టపోయిన వారి నుండి నష్టపరిహారం కోసం కమిటీలు అభ్యర్థనలను స్వీకరించడం ప్రారంభిస్తాయని డైరెక్టరేట్ పేర్కొంది. ఇప్పటివరకు "కుండపోత వర్షాల కారణంగా మేము ఎటువంటి మరణాలు లేదా గాయాలను నమోదు చేయలేదు" అని డైరెక్టరేట్ తెలిపింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రాలు, వీడియోలు మక్కాలోని భవనాలపై వర్షపు నీరు ప్రవహించడం, కార్లు కొట్టుకుపోతున్నట్లు చూపించాయి. అంతకుముందు మక్కాలో భారీ వర్షాలు పడతాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరికలు జారీ చేసింది. మక్కా ప్రాంతంలోని విపత్తు నిర్వహణ కేంద్రం నివాసితులు అవసరమైతే తప్ప తమ ఇళ్లను వదిలి రావొద్దని హెచ్చరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్‌లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 







