భారత్‌లో 2015లో 32,077 అత్యాచార కేసులు..

- April 27, 2016 , by Maagulf
భారత్‌లో 2015లో 32,077 అత్యాచార కేసులు..

భారత్‌లో 2015లో 32,077 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో వెల్లడించింది.ఈ విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరీభాయి పార్తీభాయ్‌ చౌదరి మాట్లాడారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో అందించిన వివరాల ప్రకారం పై మేరకు అత్యాచార కేసులు నమోదైనట్లు తెలిపారు.వాటిలో 1,706 గ్యాంగ్‌ రేప్‌ కేసులు ఉన్నాయని చెప్పారు. అత్యాచార బాధితులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించనుందని చెప్పారు. హోంశాఖ పరిధిలో రూ.200 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నష్టపరిహార పథకం కింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న అత్యాచార బాధితులకు పరిహారం అందిస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com