పుకార్లకు పునాదులుగా సామాజిక మీడియా

- April 27, 2016 , by Maagulf
పుకార్లకు పునాదులుగా సామాజిక మీడియా

  మనామా: సోషల్ మీడియాలో వెబ్సైట్ల లలో  ఇటీవల ఉద్భవించిన అనేక తప్పుదారి నివేదికలు కారణంగా తమకు ఉన్న స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొంటున్నారని  పత్రికా చట్టంను సవరించేటప్పుడు సోషల్ మీడియాని దారిలో పెట్టాలని  బహ్రెయిన్ ఆధారిత పాత్రికేయులు  అధికారులను కోరారు.వార్తాపత్రికలు మరియు ఇతర మీడియా సంస్థలు అధికారులు రూపొందించిన మార్గదర్శకాలకనుగుణంగా  కింద నాణ్యత ప్రమాణాలతో పని చేస్తున్నాయని పేర్కొంటూ, సామాజిక మీడియా ఇందుకు విభిన్నంగా తమ తమ  పేజీలలో తరచుగా వాస్తవాలు ఆధారాలు లేని పుకారులను ప్రజలలోనికి తీసుకువెళ్ళడం  సర్వ  సాధారణ విధానంగా మారిందని పాత్రికేయులు ఆందోళన వ్యక్తం చేశారు. " సోషల్ మీడియాలో ప్రచురణ విషయానికి వస్తే, వారు తమకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని అనుకుంటున్నాను. అక్కడ వారు ఎవరి పర్యవేక్షణలో లేకపోవడంతో వారు రెండవ ఆలోచనలు లేకుండా ఈ పుకార్లు వ్రాసి వెంటనే దాన్ని ప్రచురించినప్పుడు ఇది ఒక సమస్యగా తయారయింది, "విలేఖరి మహమ్మద్ ఝఒఉసి చెప్పారు..ఇటీవలి సంవత్సరాలలో ఇలాంటి నివేదికలు బాధితులలోఅంతర్గత వ్యవహారాల శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తో   సహా బహ్రెయిన్ అధికారులు సైతం ఉన్నారు. ఇటీవల సామాజిక మాధ్యమం లో ప్రాచుర్యం కల్గిన ఒక పుకారుని పరిశీలిస్తే  ఒక మహిళా గైనకాలజిస్టు ఒక  కేసుకి సంబంధించి మహిళకి  డెలివరీ చేసే సమయంలో శిశువు యొక్క తలని పొరబాట్నకత్తెరతో పుట్టుక్కున త్రెంచబడినట్లు వివరిస్తూ సోషల్ మీడియాలో వచ్చింది అది  దేశమంతా విస్తరించింది. ఈ అపవాదు భరించలేక ఆ మహిళా గైనకాలజిస్టు అజ్ఞాతంలోకి వెళ్ళింది. అయితే, జాతీయ ఆరోగ్య రెగ్యులేటరీ అథారిటీ (NHRA) వెంటనే విస్తృతంగా వెలువడిన పుకార్లు అబద్ధమని  కొట్టిపారేశాడు.అదేవిధంగా ఈ నెలలో  గల్ఫ్ ఎయిర్ విమానాల్లో ఒకటి కువైట్ విమానాశ్రయం రన్వే మీద కువైట్  ఎయిర్వేస్  విమానాల డీకొట్టిందని  మరో పుకారు  సోషల్ మీడియాలో పాకిపోయంది. చివరకు విమానయాన అధికారులు ప్రయాణికులని ఇది నమ్మవద్దని...ఈ వార్తను వారు ఖండించారు.పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం, మొత్తం  61 ఫిర్యాదులు  ఇటీవల నమోదయ్యాయి. కొందఱు ఇది  వ్యక్తీకరణ మరియు వాక్ స్వాతంత్ర్య దోపిడీ" గా వర్ణించారు ఒక విధంగా ఎంపీలు వ్యతిరేకంగా త్వీటింగ్  చేస్తే  500 బహేరిన్ దినార్ల జరిమానాలు నిబంధనలు ఎదుర్కొవలసి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com