తునీషా ఆత్మహత్యకి లవ్ బ్రేకప్ కారణం..
- December 26, 2022
ముంబై: 20 ఏళ్ళ వయసులో బాలీవుడ్ సినీ మరియు టీవీ నటి ‘తునీషా శర్మ’ ఆత్మహత్య హిందీ పరిశ్రమలో కలకలం రేపింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన తునీషా.. అందం అభినయంతో బుల్లితెర నుంచి వెండితెర వరకు మంచి ఆఫర్లే అందుకుంటుంది. ప్రొఫెషనల్ కెరీర్ బాగానే ఉన్న సమయంలో తునీషా ఆత్మహత్య తోటి నటీనటలను దిగ్బ్రాంతికి లోనయ్యేలా చేసింది.
శనివారం షూటింగ్లో సరదాగా పాల్గొన్న తునీషా, వెంటనే మేకప్ రూమ్‌లో ఉరువేసుకొని కనపడడం అందర్నీ కలిచివేసింది. అసలు ఏమి జరిగిందో తెలియక కంగారు పడుతున్నారు తోటి నటీనటులు. కాగా పోలీస్ ముందుగా ఈ కేసుని ఆత్మహత్యగా పరిగణించారు. అయితే సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో, హత్యకోణంలో దర్యాప్తు చేయడం కూడా మొదలుపెట్టారు.
అయితే ఈ దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. తునీషా తన కో యాక్టర్ షీజాన్ మహమ్మద్ ఖాన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే 15 రోజులు క్రిందట వీరిద్దరికి బ్రేకప్ అయ్యింది.దీంతో తునీషా బ్రేకప్ ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రియుడు షీజాన్ ని పోలీసులు అరెస్ట్ చేసి నాలుగు రోజులు జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!







