ఢిల్లీలో 5.3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
- December 26, 2022
న్యూఢిల్లీ: దేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉత్తర భారతదేశం చలికి వణుకుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలను పొగమంచు కమ్మేస్తోంది. కశ్మీర్‌లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఢిల్లీలో సగటు కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 5.3, 16.2 డిగ్రీలు ఉండగా, నిన్న కొన్ని ప్రాంతాల్లో మూడు డిగ్రీలు నమోదైంది. పలు ప్రాంతాల్లో నేడు కూడా దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని, శీతల గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
కశ్మీర్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడి ప్రజలు చలికి గడ్డకట్టుకుపోతున్నారు. దాల్ సరస్సు శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో నీరు గడ్డకట్టుకుపోయింది. ఫలితంగా నీటి సరఫరా వ్యవస్థ స్తంభించింది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 5.8 డిగ్రీలుగా నమోదైంది. ఉత్తర భారతదేశంలో మరో రెండురోజులపాటు పరిస్థితులు ఇలానే ఉంటాయని, దట్టమైన మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







