ఖతార్ లో ఘనంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు
- December 26, 2022
దోహా: సెంట్రల్ ఇండియన్ అసోసియేషన్ ఖతార్ గ్రూప్ ద్వారా క్రిస్మస్ & నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. CIA సభ్యులు హాలును అలంకరించడంతో పండుగ ఉత్సాహం వెల్లివిరిసింది. ఇతర ఆకర్షణలు పిల్లల ఆటలతో, సాంస్కృతిక కార్యక్రమా లతో మరియు దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ గాయకుల పాటలతో వెల్లి విరిసింది, మరియు ఉల్లాసాలతో నిండిపోయింది.
భగవంతుని ప్రార్థనలతో సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభమైంది. ఏ పండుగకైనా నిజమైన ఆత్మ మన హృదయంలో భగవంతుని ఉనికిని అనుభవించడంలోనే ఉంటుందని CIA వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రఫీ అన్నారు. వెలుగు మరియు ఆశల యొక్క ఈ సార్వత్రిక పండుగ అనేది ఒకరి ముఖంలో చిరునవ్వు నింపడం అని ఆయన వెల్లడించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి మాత్రమే కాకుండా ఫిలిప్పీన్స్, మలేషియా మరియు యూరప్ నుండి కూడా సభ్యులుగా ఉన్న CIA గ్రూప్ యొక్క విశిష్టతను ఆయన వివరించారు.
CIA గ్రూప్ ప్రెసిడెంట్ జై ప్రకాష్ సింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన స్వాగత ప్రసంగంలో, భాగస్వామ్య కుటుంబం మరియు మతపరమైన వేడుకల సమయంలో చారిత్రాత్మకంగా ఆచరించే సంప్రదాయ ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా మన భాగస్వామ్య గుర్తింపు, అనుబంధం మరియు అంతిమంగా శ్రేయస్సు యొక్క భావాన్ని పెంపొందించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో CIA కమిటీ సభ్యులందరి కృషిని ఆయన గుర్తించి అభినందించారు.
చూడామణి బృందం మరియు విశాలాక్షి బృందం చేసిన హై-ఆక్టేన్ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఉత్తేజపరిచాయి మరియు అందరి హృదయాలను ఉర్రూతలూగించాయి. క్రిస్మస్ పాట పాడిన ఫిలిప్పీన్స్‌కు చెందిన రీనా దానావో యొక్క డల్సెట్ వాయిస్ ఈ సందర్భంగా ఆనందాన్ని ఇచ్చింది. CIA గ్రూప్ ద్వారా క్రిస్మస్ గూడీ బ్యాగులు పిల్లలకు పంపిణీ చేయబడ్డాయి; మధ్యమధ్యలో స్పాట్ గేమ్స్ నిర్వహించబడ్డాయి, ఈ పోటీలలో పిల్లలు చాల ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులకు జ్యూస్‌లు, కేక్‌లు పంపిణీ చేసి రుచికరమైన ఆహారాన్ని అందించారు.
మొహిందర్ జలంధరి, విశాలాక్షి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వందన రాజ్ కొత్త అతిథులను మరియు పార్టిసిపెంట్లను పరిచయం చేసి, సభకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో CIA ఇతర కమిటీ సభ్యులు అశోక్ రాజ్, జోగేష్ దేవాన్, విపిన్, అస్లాం ఖాన్ మరియు జునైద్ షేక్ పాల్గొన్నారు.దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ గాయకులు జావీద్ బజ్వా, మొహిందర్ జలంధరి, సారా అలీ ఖాన్, మధు వంటేరు మరియు బాసిత్ పఠాన్ తమ శ్రావ్యమైన గాత్రాలతో పాటలు పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసారు.ఈ సంతోషకరమైన సందర్భం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సయ్యద్ రఫీ కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)


తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







