వీడియోకాన్ సీఈవో వేణుగోపాల్ ధూత్ అరెస్టు
- December 26, 2022
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన రుణాల మంజూరు అవకతవకల కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు సోమవారం మరో ప్రముఖుడిని అదుపులోకి తీసుకున్నారు.వీడియోకాన్ గ్రూప్ సీఈవో వేణుగోపాల్ ధూత్ ను అరెస్టు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ సంస్థ రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. అయితే, ఈ రుణాన్ని మంజూరు చేయడంలో పలు అవకతవకలు జరిగాయని బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారంపై దృష్టి సారించిన సీబీఐ అధికారులు.. లోన్ మంజూరులో క్విడ్ ప్రొ కో జరిగిందని తేల్చారు. చందా కొచ్చర్ బ్యాంకు సీఈవోగా ఉన్న సమయంలో ఈ రుణాల మోసం జరిగినట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి మాజీ సీఈవో చందా కొచ్చర్ తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను కూడా ఇటీవలే అరెస్టు చేశారు.
తాజాగా ఈ కేసుకు సంబంధించి వీడియోకాన్ గ్రూపు సీఈవో వేణుగోపాల్ ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు నుంచి లోన్ పొందేందుకు వేణుగోపాల్ అక్రమాలకు పాల్పడ్డాడని సీబీఐ అధికారులు చెప్పారు. వీడియోకాన్ గ్రూపు తరఫున ప్రమోట్ చేసిన పలు కంపెనీల కోసం దాదాపు రూ. 3,250 కోట్లను ఐసీఐసీఐ బ్యాంకు రుణంగా అందజేసిందని వివరించారు. ఇందుకు ప్రతిగా ఐసీఐసీఐ బ్యాంకు నాటి చైర్మన్ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కు చెందిన కంపెనీల్లో వేణుగోపాల్ రూ.64 కోట్లు పెట్టుబడులు పెట్టారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







