బీహార్లో నలుగురు విదేశీయులకు కోవిడ్ పాజిటివ్
- December 26, 2022
పాట్నా: మన దేశంలో కరోనా అదుపులోనే ఉంది. ఆదివారం దేశవ్యాప్తంగా 196 కొత్త కేసులు వెలుగు చూశాయి. రికవరీ రేటు 98.8 శాతంగా ఉంది. అంటే వైరస్ బారిన పడిన ప్రతి 100 మందిలో ఒక్కరే కోలుకోవడం ఆలస్యమవుతోంది. మరోవైపు బీహార్ లోని గయ విమానాశ్రయంలో నిర్వహించిన పరీక్షల్లో నలుగురు విదేశీ పర్యాటకులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అక్కడ అప్రమత్తత ప్రకటించారు. తోటి ప్రయాణికులను గుర్తించి, పరీక్షలు నిర్వహించనున్నారు.
చైనా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న కరోనా పాజిటివ్ వ్యక్తిని, అక్కడి నుంచి ట్యాక్సీలో ఆగ్రా తీసుకెళ్లిన డ్రైవర్ ను గుర్తించారు. చైనా నుంచి వచ్చిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. అతడితో సన్నిహితంగా మెలిగిన 27 మంది నమూనాలను పరీక్షల కోసం పంపించారు. మరోవైపు నైనిటాల్ హైకోర్టు మాస్క్ లు ధరించే విధులకు హాజరు కావాలంటూ సిబ్బంది, న్యాయమూర్తులు, న్యాయవాదులను ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ కరోనాపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో నేడు ఒక సమావేశం నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







