హూప్స్.! నయనతార ‘సొంత’ ప్రయోగం వికటించిందే.!
- December 26, 2022
ప్రమోషన్లలో ఎప్పుడూ కనిపించని నయనతార, ఈ మధ్య ప్రమోషన్లలో కనిపించిన అందరికీ షాకిచ్చింది. ఆమె తాజాగా నటించిన ‘కనెక్ట్’ చిత్రం ప్రమోషన్లలో నయన తార కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఆమె భర్త విఘ్నేష్ శివన్ నిర్మించిన సినిమా కావడంతో ఈ సినిమా ప్రమోషన్లలో నయన్ కనిపించిందంటూ మాట్లాడుకున్నారు. దొరికిందే తడవుగా, నయన్‌ని అటు తమిళ మీడియా, ఇటు తెలుగు మీడియా వరుస పెట్టి ప్రశ్నల వర్షం కురిపించి నయన్‌ని ఉక్కిరి బిక్కిర చేసిన సంగతి తెలిసిందే.
అంతా బాగానే వుంది. కానీ, ప్రమోషన్లలో పాల్గొని నయన్, ఫ్యాన్స్‌కి షాకిస్తే.. ‘కనెక్ట్’తో కనెక్ట్ అవ్వకుండా సినిమాని ఫ్లాప్ చేసి, ఫ్యాన్స్ నయన్‌కి షాకిచ్చారు. సొంత సినిమా విషయంలో ఇలా జరగడం నయన్‌కి ఒకింత బాధాకరమైన అంశమే. కానీ, ‘కనెక్ట్’ సబ్జెక్ట్ ఆడియన్స్‌కి అంతగా కనెక్ట్ కాకపోవడం వల్లనే ఈ ఫెయిల్యూర్.. అంటున్నారు.
లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ ఎంచుకునేముందు నయన్ ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సి వుందని ఆమె అభిమానులే ఆమెకు ఉచిత సలహాలిస్తున్నారట.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







