ఉద్యోగాల పేరుతో ప్రవాసులను ముంచుతున్న ఆన్‌లైన్ స్కామర్లు
- December 26, 2022
బహ్రెయిన్: ఉద్యోగాల ప్రకటనలతో ఆన్‌లైన్ స్కామర్లు ప్రవాసులను నిండా ముంచుతున్నాయి. వాట్సాప్ మెసేజ్‌లు పంపడం ద్వారా ఆశావహులను సులువుగా బుట్టలో వేసుకుంటున్నాయి. ఫుల్ టైమ్, పార్ట్‌టైమ్ జాబ్‌లను ఆఫర్ చేయడం ద్వారా ప్రవాసులను ఆకర్షించి అనంతరం వారిని నిండా ముంచుతున్నారని ఎన్‌ఆర్‌ఐ కౌన్సిల్ అధికారి తెలిపారు. ఈ ఫేక్ ప్రకటనలతో కంపెనీల బారిన పడే నిర్వాసితులు భద్రత గాల్లో దీపంగా మారుతుందన్నారు. అనుకోని ప్రమాదాల జరిగినప్పుడు నష్టపరిహారం చెల్లించడానికి అలాంటి కంపెనీలు బాధ్యత వహించవని వరల్డ్ ఎన్‌ఆర్‌ఐ కౌన్సిల్‌లోని మిడిల్ ఈస్ట్ రీజియన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ డైరెక్టర్ సుధీర్ తిరునిలత్ చెప్పారు. మోసపోతున్న వారిలో బాధితులు ఎక్కువగా విజిట్ వీసాలపై పనికోసం వచ్చినవారే అధికమన్నారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా సేల్స్ డిగ్రీలను కలిగి ఉన్న చాలా మంది ఉద్యోగం కోసం ఇక్కడకు రప్పించి అందినకాడికి దండుకుంటారు. ఆ తర్వాత వారిని 100 నుండి 200 బహ్రెయిన్ దినార్ల ఉద్యోగాలలో నియమించి చేతులు దులుపుకుంటారు. మోసపోయిన వారు బహిష్కరణ భయంతో నిందితులపై ఫిర్యాదు చేయని కారణంగా మోసగాళ్లపై చర్యలు తీసుకోవడం లేదని భద్రతాధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







