మూడో కార్తికేయుడు నిఖిల్ హింట్ ఇచ్చేశాడుగా.!

- December 27, 2022 , by Maagulf
మూడో కార్తికేయుడు నిఖిల్ హింట్ ఇచ్చేశాడుగా.!

యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో ‘కార్తికేయ’ సూపర్ హిట్ సినిమా. దానికి సీక్వెల్‌గా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కార్తికేయ 2’ ప్యాన్ ఇండియా కేటగిరిలో మంచి విజయం దక్కించుకుంది. అనూహ్యమైన వసూళ్లు రాబట్టింది.
ఇదే హుషారులో ‘18 పేజెస్’ అనే సినిమాని గత వారం రిలీజ్ చేసి మరో హిట్ కొట్టేశాడు నిఖిల్. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లోకి వచ్చాడు నిఖిల్.
ఈ సందర్భంగా ‘కార్తికేయ 3’ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. సీక్వెల్స్‌లా కాకుండా, ప్రాంఛైజీల రూపంలో ‘కార్తికేయ’ సినిమాలు వస్తూనే వుంటాయట. ముఖ్యంగా మూడో కార్తికేయ కోసం ఆల్రెడీ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనుకున్నారట. అది డెవలప్ చేసే పనిలోనే ప్రస్తుతం డైరెక్టర్ చందూ మొండేటి వున్నాడని నిఖిల్ చెప్పాడు.
అంతేకాదు, ‘కార్తికేయ 3’ని 3D ఫార్మేట్‌లో తెరకెక్కించబోతున్నామనీ నిఖిల్ చెప్పాడు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com