బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- October 30, 2025
మనామా: బహ్రెయిన్ లో తొమ్మిది దేశాల సైనిక విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. వీటిని యూఏఈ ఉప ప్రధాన మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ హిస్ ఎక్సలెన్సీ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా తొమ్మిది దేశాల ఉమ్మడి సైనిక దళాల విన్యాసాలను ప్రారంభించనున్నారు. ఇవి మూడు రోజుల పాటు జరుగుతాయి.
బహ్రెయిన్, యుఎఇ, మొరాకో, సెనెగల్, ఫ్రాన్స్, స్పెయిన్, సింగపూర్, ఇటలీ మరియు స్లోవేకియా వంటి తొమ్మిది దేశాల నుండి సైనిక దళాలు పాల్గొంటున్నాయి. సభ్య దేశాల భద్రతా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం మరియు నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడం లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ముప్పులను ఎదుర్కోవడానికి ఇలాంటి సైనిక ఎక్సర్ సైజులు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







