కువైట్‌.. ఈ ఏడాది రోడ్డుప్రమాదాల్లో 170 మంది మృతి

- December 28, 2022 , by Maagulf
కువైట్‌.. ఈ ఏడాది రోడ్డుప్రమాదాల్లో 170 మంది మృతి

కువైట్: కువైట్ 2022 జనవరి 1, నవంబర్ 30 మధ్య 170 ట్రాఫిక్ సంబంధిత మరణాలు చోటు చేసుకున్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ కాలంలో దేశంలో నమోదైన మొత్తం ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య దాదాపు 3.4 మిలియన్లు అని వెల్లడించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖలోని ప్లానింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ గణంకాలను విడుదల చేసింది. ఆరు గవర్నరేట్‌లలో జరిగిన మొత్తం ట్రాఫిక్ ప్రమాదాలలో 92 శాతం డ్రైవింగ్‌లో అజాగ్రత్త కారణంగా సంభవించాయని, మిగిలిన 8 శాతం ఇతర కారణాల వల్ల జరిగాయన్నారు. ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా మొత్తం మరణాల సంఖ్య 170 కేసులు కాగా, అత్యధికంగా అల్-జహ్రా గవర్నరేట్‌లో 52 మరణాలు చోటుచేసుకోగా.. అత్యల్పంగా హవల్లి గవర్నరేట్‌లో 10 మరణాలు సంభవించినట్లు గణాంకాలు తెలిపాయి. దుర్మరణం పాలయిన 170 మందిలో 152 మంది పురుషులు,18 మంది మహిళలు ఉన్నారు. మరణించిన వారిలో అత్యధికంగా 42 మంది.. 31 -40 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com