భారత్ తయారీ సిరప్ తాగి 18 మంది చిన్నారుల మృతి!
- December 29, 2022
ఉజ్బెకిస్థాన్: భారత తయారీ సిరప్‌ను తాగి గాంబియాలో 70 మంది చిన్నారులు మృతి చెందిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగింది.నోయిడాలోని మారియన్ బయోటెక్ తయారు చేసిన ‘డాక్-1 మ్యాక్స్’ సిరప్‌ను తాగి 18 మంది చిన్నారులు మరణించినట్టు ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. సిరప్‌ను ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా బాధిత చిన్నారులకు ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ఈ మరణాలు సంభవించినట్టు తేలిందని పేర్కొంది. సిరప్‌లో కలుషిత ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు లేబరేటరీ పరీక్షల్లో వెల్లడైందని పేర్కొంది.
సిరప్‌లోని కొన్ని నిర్దిష్ట బ్యాచ్‌లో ఇథిలీన్ గ్లైకాల్ ఉనికి బయటపడినట్టు లేబరేటరీ ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైంది. సిరప్ విషపూరితమైందని, దానిని అధికమోతాదులో తీసుకోవడం వల్ల వాంతులు, స్పృహ కోల్పోవడం, హృదయ సంబంధ సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం ఏర్పడొచ్చని లేబరేటరీ అధ్యయనం పేర్కొంది. గాంబియాలో ఈ ఏడాది 70 మంది చిన్నారుల మృతికి కారణమైన నాలుగు సిరప్‌లలో కలుషిత ఇథిలీన్ గ్లైకాల్, డై ఇథిలీన్ గ్లైకాల్‌ను కనుగొన్నారు. చిన్నారుల మరణాలపై విచారణ జరుగుతున్నట్టు ఉజ్బెకిస్థాన్ పేర్కొంది. కాగా, ఈ మరణాలపై సిరప్‌ను తయారుచేసిన మారియన్ బయోటెక్ కానీ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
డాక్-1 మ్యాక్స్‌లో పారాసెటమాల్ కూడా ఒకటిగా ఉండడంతో స్థానిక ఫార్మసీల సిఫార్సులపై చిన్నారుల తల్లిదండ్రులు దీనిని జలుబు మందుగా తప్పుగా అర్థం చేసుకుని ఉపయోగించినట్టు ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరణాలకు అదే కారణమై ఉంటుందని పేర్కొంది. బాధిత చిన్నారులు ఆసుపత్రిలో చేరడానికి ముందు రెండు నుంచి 7 రోజులపాటు రోజుకు మూడు నాలుగుసార్లు 2.5 నుంచి 5 ఎంఎల్ డోసు వేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సాధారణంగా తీసుకోవాల్సిన డోసుకు ఇది మించిపోయిందన్నారు.
ఏడాది లోపు చిన్నారులకు 100 నుంచి 125 మిల్లీ గ్రాములు, ఒకటి నుంచి మూడేళ్లలోపు పిల్లలకు 200 మిల్లీగ్రాములు, 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు 250 మిల్లీ గ్రాములు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు, దీనిని 38 నుంచి 38.5 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత వద్దే తీసుకోవాలని, సాధారణ శరీర ఉష్ణోగ్రత వద్ద తీసుకోకూడదని వివరించారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







