కందుకూరు ఘటన పై సిఎం జగన్ దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటించిన జగన్
- December 29, 2022
అమరావతి: నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు ప్రధాని మోడీ కూడా ఇంతే మొత్తంలో పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల