ఎడారి హాట్‌స్పాట్‌ కువైట్‌లో వడగళ్ల వానలు

- December 29, 2022 , by Maagulf
ఎడారి హాట్‌స్పాట్‌ కువైట్‌లో వడగళ్ల  వానలు

కువైట్: భూమిపై అత్యంత వేడిగా ఉండే దేశాలలో ఒకటైన కువైట్‌లో అరుదైన వడగళ్ల తుఫాను పిల్లలు, పెద్దలను ఆనందపరుస్తోంది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "మేము 15 సంవత్సరాలలో శీతాకాలంలో ఇంత వడగళ్ళు చూడలేదు" అని కువైట్ వాతావరణ విభాగం మాజీ డైరెక్టర్ ముహమ్మద్ కరం చెప్పారు. అరుదైన వడగళ్ళు , మంచుతో పాక్షికంగా కప్పబడిన దక్షిణ రహదారుల చిత్రాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో విపరీతంగా షేర్ అవుతున్నాయి.

కువైట్ నగరానికి దక్షిణంగా 50 కిలోమీటర్లు (30 మైళ్లు) దూరంలో ఉన్న ఉమ్ అల్-హైమాన్ జిల్లాలో వడగళ్ల వాన కురుస్తున్నప్పుడు పిల్లలు స్కార్ఫ్‌లు, రెయిన్‌కోట్‌లను ధరించి ఆస్వాదిస్తున్నారు. చమురు సమృద్ధిగా ఉన్న గల్ఫ్ దేశం కువైట్ లో వేసవి వేడి భవిష్యత్తులో పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2016లో వేసవి ఉష్ణోగ్రతలు 54 డిగ్రీల సెల్సియస్ (129 డిగ్రీల ఫారెన్‌హీట్) వద్ద గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చారిత్రక సగటుతో పోల్చితే కువైట్‌లోని కొన్ని ప్రాంతాలు 2071 నుండి 2100 వరకు 4.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని ఎన్విరాన్‌మెంట్ పబ్లిక్ అథారిటీ హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com