జనవరిలో ఇండియాలో స్కిల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌:సౌదీ

- December 29, 2022 , by Maagulf
జనవరిలో ఇండియాలో స్కిల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌:సౌదీ

రియాద్: ఈ నెలాఖరులో ఇండియాలో నైపుణ్య ధృవీకరణ కార్యక్రమం (SVP)  మొదటి దశను ప్రారంభించనున్నట్లు సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD)  ప్రకటించింది. ఇండియా రాజధాని న్యూఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలో పైలట్ దశను ప్రారంభించనున్నది.  మొదటి దశలో నైపుణ్య పరీక్ష కోసం ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, రిఫ్రిజిరేషన్/ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్, ఆటోమొబైల్ ఎలక్ట్రీషియన్ వంటి ఐదు వృత్తులను ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం కింద భారతీయ కార్మికులు సౌదీ వర్క్ వీసా కోసం దరఖాస్తు చేయడానికి ముందు నైపుణ్యం కలిగిన కార్మికుల రాత, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. SVP సౌదీ ఉపాధి మార్కెట్లో నైపుణ్యం కలిగిన కార్మికుల వృత్తిపరమైన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, అలాగే వారి ఉత్పాదకతను మెరుగుపరచడానికి, వారు అందించే వృత్తిపరమైన సేవల నాణ్యతను మెరుగుపరచడానికి MHRSD ప్రయత్నాలకు కొనసాగింపుగా ప్రవేశపెట్టింది.  సౌదీ లేబర్ మార్కెట్‌లో నైపుణ్యం కలిగిన కార్మికుల సామర్థ్యాన్ని నిర్ధారించడానికి SVPని మార్చి 2021లో ప్రారంభించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com