ఏపీలో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.12 కోట్లతో మహిళ పరార్

- December 29, 2022 , by Maagulf
ఏపీలో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.12 కోట్లతో మహిళ పరార్

అమరావతి: సూళ్లూరుపేటలో భారీ మోసం వెలుగుచూసింది. చిట్టీల పేరుతో ఓ మహిళ నిలువునా ముంచేసింది. సుమారు 12 కోట్లకు టోకరా వేసిన మహిళ.. కనిపించకుండా పోయిందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

సూళ్లూరుపేట రైల్వే గేట్ రోడ్ లో నివసిస్తున్న పద్మావతి శెట్టి అనే మహిళ దుస్తుల వ్యాపారం చేస్తోంది. స్థానికంగా చాలా కాలం నుంచి వ్యాపారం చేస్తూ అందరి అభిమానం సంపాదించింది.ఈ పరిచయాలు ఉపయోగించుకుని కొన్నేళ్ల నుంచి చిట్టీలు వేయడం మొదలుపెట్టింది. మొదట్లో బాగానే సాగిన లావాదేవీలతో ఆమె వద్ద చిట్టీలు వేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. కొన్ని రోజుల నుంచి చిట్టీలు పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్న పద్మావతి శెట్టి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది.

ఈ విషయం ఆ నోట ఈ నోట తెలుసుకున్న బాధితులు ఒక్కసారిగా ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆమె డబ్బుతో పరార్ అయ్యిందని తెలుసుకుని పద్మావతి ఇంట్లో ఉన్న దుస్తులను మూట కట్టి పట్టుకుని పోయారు కొందరు బాధితులు. ఎంతో కొంత దక్కించుకున్నామనే ఆశతో మరికొందరు బాధితులు ఆటోల్లో వచ్చి దుస్తుల మూటలను పట్టుకెళ్లారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com