తగ్గిన బంగారం ధర

- April 27, 2016 , by Maagulf
తగ్గిన బంగారం ధర

నగల దుకాణదారులు సమ్మె విరమించడంతో నేడు దేశ రాజధాని సహా పలు చోట్ల పసిడి దుకాణాలు తిరిగి తెరుచుకున్నాయి. వెండియేతర ఆభరణాలపై ప్రభుత్వం ఒక శాతం ఎక్సైజ్‌ సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి సమ్మె ప్రారంభించిన విషయం తెలిసిందే.

బుధవారం బంగారం ధర పెరిగింది. రూ.215 పెరగడంతో పసిడి ధర రూ.29,790కి చేరింది. పెళ్లిళ్ల సీజన్‌ డిమాండుతో రీటైలర్ల నుంచి కొనుగోళ్లు వూపందుకున్నాయని, దీంతో ఈ లోహం ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.08శాతం పెరిగి 1,244.30 యూఎస్‌ డాలర్లకు చేరింది.
ఒక్కరోజులో రూ.775 పెరిగిన వెండి వెండి బుధవారం ఒక్క రోజే రూ.775 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.40,975కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com