మద్యం అమ్మకాలపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
- December 29, 2022
హైదరాబాద్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు చేసేందుకు అనుమతించింది. బార్స్, పబ్స్, లిక్కర్ షాప్స్ అర్థరాత్రి వరకు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ గల బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. గతంలో రెండేళ్లుగా కరోనా సమయంలో న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం అమ్మకాలు నిలిచిపోయి, వ్యాపారులు నష్టపోయారని, అందువల్ల ఈ వెసులుబాటు కల్పించినట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో మందు షాపులు, బార్లు, పబ్బుల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే మందు తప్పనిసరిగా ఉండాల్సిందే.
సాధారణంగా ఇలాంటి సందర్భంలో ఒక గంట మాత్రమే అదనంగా మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతిస్తారు. అయితే, ఈ సారి మాత్రం అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించడం విశేషం. ఈ లెక్కన ఈ సారి డిసెంబర్ 31న మద్యం విక్రయాలు ఊహించని స్థాయిలో జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







