ఫేస్బుక్ మరో యాప్‌ను తీసుకొస్తోంది
- April 27, 2016
సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో యాప్‌ను తీసుకొస్తోంది. వినియోగదారులు ఎప్పటికప్పుడు ఫొటోలను షేర్ చేస్తూ.. వీడియోలను ప్రత్యక్షప్రసారంలో స్నేహితులతో పంచుకునేందుకు వీలుగా సరికొత్త కెమెరా యాప్‌ను రూపొందిస్తోంది.
ప్రస్తుతం సోషల్‌మీడియాలో లైవ్‌స్ట్రీమింగ్ ట్రెండ్ జోరందుకుంది. పెరిస్కోప్.. మీర్‌క్యాట్.. స్నాప్‌చాట్ తదితర ప్రత్యక్షప్రసారాల యాప్‌ల వాడకం పెరిగిపోతోంది. పెరిస్కోప్ యాప్‌తో మన కళ్లముందు జరిగే ప్రతి సన్నివేశాన్నీ చిత్రీకరిస్తూ ట్విట్టర్లో ప్రత్యక్షప్రసారం చేసుకునే వీలుంది. అలాగే.. స్నాప్‌చాట్ యాప్‌తోనూ లైవ్ వీడియోలను షేర్ చేసుకోవచ్చు. అయితే.. ఈ విషయంలో సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాత్రం కాస్త వెనకబడి ఉందట.
ఎఫ్‌బీలోనూ లైవ్ స్ట్రీమింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చినా.. దాన్ని ఉపయోగిస్తున్న వారి సంఖ్య వూహించిన స్థాయిలో పెరగడం లేదని చెబుతున్నారు. చాలా మంది రోజూ ప్రొఫైళ్లు చూసుకుంటున్నా.. ఫొటోలు.. వీడియోల షేరింగ్ మాత్రం తగ్గింది. 2015తో పోల్చితే 2016 తొలి త్రైమాసికంలో 9 శాతం తక్కువ వీడియోలను.. ఫొటోలను షేర్ చేసినట్లు ఓ సంస్థ జరిపిన పరిశోధనలో తేలింది.
ఇక ఈ కెమెరా యాప్‌తో యూజర్లను ఆకట్టుకునే వీలుంటుందని ఫేస్బుక్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ యాప్‌ను లండన్‌లోని ఫేస్‌బుక్‌కి చెందిన 'షేరింగ్' బృందం అభివృద్ధి చేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







