అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పై కేసు నమోదు
- December 30, 2022
తెలంగాణ: అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని..మతవిద్వేషానలు సహించేదిలేదని స్పష్టంచేశారు ఎస్పీ. చట్టప్రకారం నరేష్ కు శిక్ష పడేలా చూస్తామని అయ్యప్ప స్వామిలకు హామీ ఇచ్చారు ఎస్పీ. ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడినా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా రెండు రోజుల క్రితం నారాయణపేట కోస్గి శివాజీ చౌక్ వద్ద అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. దీంతో అయ్యప్ప స్వామి మాల ధరించిన కొంతమంది స్వాములు నరేశ్ పై దాడి చేశారు. కోస్గిలో నరేష్ పై అతడు తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేయగా పరిగెత్తించి మరీ కొట్టారు. ఇదే సమయంలో సమీపంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని నరేష్ పై దాడి చేసిన అయ్యప్ప భక్తులను అడ్డుకున్నారు. భైరి నరేష్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు నిరసన చేపట్టారు.
దీంతో జిల్లా ఎస్పి కోటిరెడ్డి స్పందిస్తూ ఎవరి మనోభావాలు ఎవరు దెబ్బతీయకూడదని అటువంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నరేశ్ పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చట్ట ప్రకాశం చర్యలు తీసుకుంటామని అయ్యప్ప భక్తులకు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..